నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సభ్యులు చిన్నయ్య పెద్దయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ శివారులో ఉన్న చిన్నయ్య పెద్దయ్య లొద్ది వద్ద కొలువై ఉన్న విగ్రహాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించి మొక్కులు చెల్లించారు. పంట బాగా పండి రైతులంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.ప్రతి సంవత్సరం ఖరీఫ్ లో వచ్చే మొదటి పంట అయిన మొక్కజొన్న కంకులను చిన్నారి పెద్దాయకు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. చిన్నయ్య పెద్దయ్యకు మొక్కజొన్న కంకులను సమర్పించిన అనంతరం పంట కోతలను రైతులు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు కొత్తపల్లి అశోక్, కొత్తపల్లి అరుణ్, రాజేశ్వర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నయ్య పెద్దయ్యకు ముదిరాజ్ సభ్యుల ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES