- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గురువారం, చెరువు మత్తడి వద్ద, కట్టమైసమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు సారే, చీర, పసుపు, కుంకమ్మలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మధ్య కురుస్తున్న వర్షాలకు నీరు చెరువులోకి చేరి అలుగు పారుతుండడంతో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగ సత్యనారాయణ, సీనియర్ నాయకులు భూషోల్ల శ్రీనివాస్, మండల ఓబీసీ చైర్మన్ శిఖ అరవింద్, బందారపు బిక్షపతి గౌడ్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -