నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నర్సాపూర్ గ్రామంలో హనుమాన్ యువ సేన ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దుర్గాదేవి మండపం వద్ద కుంకుమపూజ, యజ్ఞ హోమం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి మండపం వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి కుంకుమ పూజలో పాల్గొని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా హనుమాన్ యువసేన సభ్యులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దుర్గాదేవి మండప నిర్వాహకులైన యువసేన సభ్యులు తెలిపారు. ఎల్లప్పుడు ఆ దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సాపూర్ హనుమాన్ యువసేన సభ్యులు, మహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవి మండపం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES