Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్భారత సైన్యానికి మద్దతుగా మేడారంలో ప్రత్యేక పూజలు 

భారత సైన్యానికి మద్దతుగా మేడారంలో ప్రత్యేక పూజలు 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా విరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మద్దతుగా మేడారంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం మేడారంలోని సమ్మక్క- సారలమ్మ వనదేవతల సన్నిధిలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, ఎండోమెంట్ అధికారులు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే బెల్లం సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు మాట్లాడుతూ.. “దేశ రక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూరం విజయవంతం కావాలని వనదేవతలకు ప్రత్యేక మొక్కలు చెల్లించినట్లు తెలిపారు. భారత్ మాతాకీ జై, జై భారత్, జై జై భారత్ అని నినాదాలు చేశారు. సైనికులు సురక్షితంగా తిరిగి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని” తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు సిద్దబోయిన వసంతరావు, వెంకటేశ్వర్లు, సత్యం, ఎండోమెంట్ అధికారులు బాలకృష్ణ, కిషన్, పూజారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -