Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడిబాటకు విశేష స్పందన

బడిబాటకు విశేష స్పందన

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ మరియు పదిమంది వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి గ్రామస్తుల నుండి విశేష ఆదరణ లభించింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామంలో విద్యా చైతన్యాన్ని కలిగించింది.

ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్న 68 మంది విద్యార్థులు టంగుటూరు ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలో చేరేందుకు సిద్ధం కావడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది. గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నాణ్యమైన విద్యా కార్యక్రమాలు, సదుపాయాలు, విద్యార్థుల ప్రగతి గురించి గ్రామస్తులకు వివరించారు. అలాగే గ్రామంలోని పాఠశాలలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చొరవతో అవగాహన కల్పించారు.

విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లను గ్రామస్తులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హితవరు కట్ట రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కోడం రమాదేవి, రవికుమార్, శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, వెంకటేష్, లింగయ్య,గ్రామ యువకులు, పాఠశాల హితవులు, పెద్దలు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామస్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -