పిఏసిఎస్ పాలకవర్గాలు రద్దు
నవతెలంగాణ – మల్హర్ రావు
సహకార శాఖలోనూ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్ల పదవీకాలం శుక్రవారంతో ముగిశాయి. దీంతో శనివారం సొసైటీల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 6,మండల కేంద్రంలో ఒకటి పిఏసిఎస్ కేంద్రాలున్నాయి. ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అయితే డీసీసీబీ చైర్మన్లంతా సీఎం రేవంత్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఆరు నెలలపాటు వారి పదవీకాలం పొడిగించింది. ఈ గడువు శుక్రవారంతో ముగిసింది. ఎన్నికలు జరగక పోవడంతో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిధిలో 6 సొసైటీలకు పర్సన్ ఇన్చార్జీలను నియమించారు.శనివారం వారు తమకు కేటాయించిన సోసైటీల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.
సహకార శాఖలోనూ ‘ప్రత్యేక’పాలన.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



