– గోవధతో శాంతిభద్రతలపై ప్రభావం : పంజాబ్-హర్యానా హైకోర్టు
చండీగఢ్ : గోవుకు విశిష్ట హోదా ఉందని, గోవధతో శాంతిభద్రతలపై ప్రభావం పడుతుందని పంజాబ్ హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. గోవు ఒక పవిత్ర జంతువు మాత్రమే కాదని, దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమని పేర్కొంది. గోవధ ఆరోపణల కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్‌ను కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలుసునని, అయితే అలాంటి స్వేచ్ఛ ఈ కేసులో దుర్వినియోగమయిందని కోర్టు తెలిపింది. ఈ కేసు పూర్తి వివరాల ప్రకారం వధ కోసం గోవులను రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో నుV్‌ాకు చెందిన ఆసిఫ్ మరో ఇద్దరిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమదయింది. హర్యానా గోవంశ్ సరరక్షణ్, గౌ సంవర్ధన్ చట్టం 2015, ఇతర చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కింద కోర్టు వీరికి బెయిల్ మంజారు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ సందీప్ మౌద్గిల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విభిన్న విశ్వాసాలతో కూడిన మన సమాజంలో కొన్ని చర్యలు వ్యక్తిగతమైనప్పటికీ.. మరొక విశ్వాసానికి చెందిన గణనీయమైన జనాభా యొక్క నమ్మకాలను కించిపరిస్తే శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ధర్మాసనం తెలిపింది. భారత సమాజంలో ఆవుకు ఉన్న ప్రత్యేక హోదాను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత కేసులో ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది. రాజ్యాంగం కేవలం హక్కులను రక్షించడం కోసమే కాదని, న్యాయమైన -కరుణామయమైన-సంఘటిత సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుందని కోర్టు తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి) దేశంలోని ప్రతీపౌరుడు అన్ని జీవరాశి పట్ల కరుణ చూపించాల ని ఆదేశిస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా 2005లో గుజరాత్ ప్రభుత్వం వర్సెస్ మీర్జాపూర్ మోతీ కురేషి కస్సబ్ జమాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు గుర్తు చేసింది. ఈ కేసులో గోవధ నిషేధ చట్టాల రాజ్యాంగ చెల్లుబా టును సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది.
గోవుకు విశిష్ట హోదా
- Advertisement -
- Advertisement -