Tuesday, February 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబర్త్‌డేకి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

బర్త్‌డేకి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

- Advertisement -

హీరో నాని ప్రస్తుతం నటిస్తున్న పాన్‌ వరల్డ్‌ సినిమా ‘ది ప్యారడైజ్‌’. ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి భారీ కాన్వాస్‌ పై నిర్మిస్తున్నారు.
టైటిల్‌ గ్లింప్స్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఇప్పటికే సినిమాపై హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఇప్పుడు మేకర్స్‌ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈనెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వేడుకలకు టీమ్‌ సిద్ధమవుతోంది. అదే రోజున చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ఆయా షేర్‌’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గూస్‌బంప్స్‌ తెప్పించే ఈ ఇంట్రడక్షన్‌ ట్రాక్‌తో సినిమా ప్రమోషన్స్‌కు ఘనమైన ఆరంభం ఇవ్వబోతున్నారు మేకర్స్‌. ఈ పాటను వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో చిత్రీకరించారు.

నాని ఫియర్స్‌లెస్‌, మాస్సీ అవతార్‌లో కనిపించే ఈ సాంగ్‌ కోసం అనిరుధ్‌ రవిచందర్‌ పవర్‌ఫుల్‌ మాస్‌ ట్యూన్‌ అందించారు. సుధన్‌ మాస్టర్‌ రూపొందించిన డైనమిక్‌ కొరియోగ్రఫీ ఈ ట్రాక్‌ను విజువల్‌ స్పెక్టాకిల్‌గా అలరించబోతోంది. అభిమానులకు ఇది బర్త్‌డే ట్రీట్‌గా మారనుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాల్‌, స్పానిష్‌, ఇంగ్లీష్‌ భాషలలో పాన్‌-వరల్డ్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది అని మేకర్స్‌ తెలిపారు. మోహన్‌ బాబు, బాలీవుడ్‌ నటుడు రాఘవ్‌ జుయాల్‌, సంపూర్ణేష్‌ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈచిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి, డిఓపి: సిహెచ్‌ సాయి, సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -