Wednesday, May 21, 2025
Homeకరీంనగర్బోధన నైపుణ్యాల అభివృద్ధికే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

బోధన నైపుణ్యాల అభివృద్ధికే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ – ధర్మారం
ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాలను పెంపొందించుటకే ఐదు రోజులపాటు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మండల విద్యాధికారి, కోర్స్ డైరెక్టర్ పోతు ప్రభాకర్ అన్నారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని వంద మంది ఉపాధ్యాయు లకు మంగళవారం నుండి శనివారం వరకు ఐదు రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో మండలంలోని ఎనిమిది మంది మండల రిసోర్స్ పర్సన్లు తమ సేవలను అందిస్తున్నారన్నారు. ఈ  శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల్లో నెలకొని ఉన్న సామర్థ్యాలను పెంపొందించుటకు,వివిధ అంశాల్లో నైపుణ్యం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింద న్నారు.శిక్షణలో భాగంగా బోధనా పద్ధతుల్లో నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల్లో చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియల్లో ఎంచుకోవాల్సిన వ్యూహాలు, బోధనలో టెక్నాలజీ వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవడం, ప్రభావవంతంగా పరీక్షల నిర్వహణ, ఫలితాల విశ్లేషణ, విద్యార్థులకు మరియు పాఠశాలలకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని లక్ష్యసాధన కొరకు నిరంతరం శ్రమించడం, పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వామ్యం వహించేలా చేయడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల సర్వతోముఖ వికాసానికి ఉపాధ్యాయులను సంసిద్ధం చేయటం వంటి అనేక అంశాలలో రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

 ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరం లో పెద్దపెల్లి జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎఫ్ ఎల్ ఎన్ ఛాంపియన్ షిప్ పోటీలో మండలం నుండి పన్నెండు పాఠశాలలు ఎంపికై జిల్లా కలెక్టర్ చే ప్రశంసలు పొందడం, జిల్లాలో మొదటి స్థానాన్ని సాధించడం మనకు ఎంతో గర్వకారణం అన్నారు. ఛాంపియన్ షిప్ సాధించిన పాఠశాలల ఉపాధ్యాయ బృందాలను ఈ సందర్భంగా మండల విద్యాధికారి అభినందించారు. ఇదే ఉత్సాహంతో రాబోవు విద్యా సంవత్సరంలో సైతం ఉపాధ్యాయులంతా శ్రమించి ధర్మారం మండలాన్ని విద్యా విభాగంలో అగ్ర స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు జాడి శ్రీనివాస్, గుర్రాల గంగారెడ్డి, ఈగం సంతోష్ కుమార్, హైమావతి, గంకిడి వెంకట రమణారెడ్డి, సిరిపురం సునీల్, ఆడిచర్ల సతీష్, బి. జలపతి,ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంతోష్ మల్లారెడ్డి, నూతి మల్లన్న, మోతిలాల్ నాయక్, రాములు, స్వామి నాయక్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -