- Advertisement -
నేటి నుంచి అడ్వాన్స్ బుకింగ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయనుంది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవాలని సూచించింది. దాదాపు 33 రైళ్లను సంక్రాంతి నేపథ్యంలో నడుపున్నట్టు సీపీఆర్‌వో శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయా రైళ్లుకాకినాడ, వికారాబాద్, సికింద్రాబాద్, తిరుపతి, లింగంపల్లి, నర్సాపూర్ మధ్య నడుస్తాయని వివరించారు. ఒకటి నుంచి మూడు సర్వీసుల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
- Advertisement -



