జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
నవతెలంగాణ – తాంసి
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికను రూపొందించే అవలంబందించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. మంగళవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో కలిగిన 3 మండలాలలో జిల్లా ఎస్పీ రెండు సంవత్సరాలుగా జరిగిన ప్రమాదాల ప్రదేశాలను సందర్శించి ప్రమాదాలు జరిగిన కారణాలు వాటికి నివారించేందుకు చేయవలసిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచించారు. ఆర్ అండ్ బి, రెవెన్యూ, పంచాయతీరాజ్, నేషనల్ హైవే అథారిటీ, కాంట్రాక్టర్స్ తో పాటుగా పోలీసు అధికారులతో ప్రమాదాల స్థలాలను పరిశీలించి సిబ్బందికి, అధికారులకు ప్రమాదాల నివారణకు చేయవలసిన సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా తాంసి, తలమడుగు మండలాలలోని పొన్నారి హస్నపూర్ సుంకిడి అంతరరాష్ట రోడ్డు పై ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను సదర్శించడం, అదే విధంగా ఆదిలాబాద్ రూరల్ పరిధిలో ఉన్న ప్రదేశాలను సందర్శించడం జరిగింది.
అదేవిధంగా గత సంవత్సరాలుగా జరిగిన ప్రమాదాల విశ్లేషణ చేసి ఇకముందు ప్రమాదాలు జరగకుండా చర్యల చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా రహదారుల వెంట ఉన్న గ్రామాలకు సరి వెళ్లే రోడ్ల నందు స్పీడ్ బ్రేకర్లను చేయాలని, అవసరమైన ప్రదేశాలలో రంబుల్ స్టెప్స్ ఏర్పాటు చేయాలని, నిర్మాణ ప్రదేశాలలో తగు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాత్రి సమయాలలో కనిపించే విధంగా రేడియం తో స్టిక్కర్లను ఏర్పాటు చేసే ప్రమాదాలు జరగకుండా నివారించాలని సూచించారు. ముఖ్యంగా ఎక్కువ వేగంగా వెళ్లే దారులలో వేగ నియంత్రణకు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రి సమయాలలో గ్రామాలను పట్టణాల నందు ప్రవేశిస్తున్న జాతీయ రహదారులలో లైట్ల ఏర్పాటు ఉండాలని తెలిపారు. ప్రమాదాలను నివారించే ప్రాణ నష్టాన్ని తగ్గించడమే జిల్లా పోలీసుల ప్రధాన ధ్యేయంగా, ప్రజల రక్షణకై పోలీసు వ్యవస్థ కష్టపడుతుందని తెలిపారు. ఎలాంటి రోడ్డు ఇంజనీరింగ్ సమస్యలు ఉన్న ప్రమాదాలకు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ కె ఫణిదర్, ఎస్ఐ లు డి రాధిక, జీవన్ రెడ్డి, విష్ణువర్ధన్ అయా గ్రామల ప్రజలు పోలిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



