క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి
నిషేధిత భూముల వివరాలను అందించాలి
కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
నవతెలంగాణ – పాలకుర్తి
భూభారతి సాదా బైనామ దరఖాస్తుల సమస్యలను పరిష్కరించేందుకు వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తహసిల్దార్ నాగేశ్వర చారిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులల్లో వచ్చిన భూభారతి సాదా బైనామాల దరఖాస్తుల పరిశీలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దస్తావేజులను పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో భూములను గుర్తించాలని సూచించారు. నిషేధిత భూముల వివరాలను అందించాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి 6,7,8 దరఖాస్తులను పరిశీలించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎలాంటి పెండింగులు ఉండకూడదు అని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగేశ్వర చారి తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తుల్లో వేగం పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES