– బంగ్లాతో వన్డేలో విండీస్ రికార్డు
– సూపర్ ఓవర్లో కరీబియన్ల గెలుపు
ఢాకా (బంగ్లాదేశ్) : కరీబియన్లు క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పారు. భీకర పేస్‌కు పెట్టింది పేరు వెస్టిండీస్. కానీ మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో విండీస్ ఏకంగా 50 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేసింది. పేస్ బౌలర్లను పక్కనపెట్టిన వెస్టిండీస్ పూర్తి కోటా ఓవర్లను స్పిన్నర్లకు అందించింది. బంగ్లాదేశ్ సైతం 50 ఓవర్లలో 42 ఓవర్లను స్పిన్నర్లకు అందించింది. దీంతో ఓ వన్డే మ్యాచ్‌లో 92 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేయటంతో కొత్త రికార్డు నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (45), మెహిది హసన్ మిరాజ్ (32), రిషద్ హౌస్సేన్ (39 నాటౌట్) రాణించారు. విండీస్ స్పిన్నర్లు మోటీ (3/65), అకీల్ (2/41), అలిక్ (2/14) మాయ చేశారు. ఛేదనలో విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేసింది. 133/7తో ఓటమి కోరల్లో కూరుకున్న కరీబియన్లు.. టెయిలెండర్లు జస్టిన్ గ్రీవ్ (26), అకీల్ (16) మెరుపులతో స్కోరు సమం చేసింది. 50 ఓవర్ల మ్యాచ్‌లో స్కోర్లు సమం కాగా.. మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. వెస్టిండీస్ తొలుత 6 బంతుల్లో 10 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్ ఆరు బంతుల్లో ఓ వికెట్‌కు 9 పరుగులే చేసింది. ఒక్క పరుగుతో తేడాతో సూపర్ ఓవర్లో గెలుపొందిన వెస్టిండీస్.. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను సమం చేసింది.
స్పిన్నర్లే 50 ఓవర్ల బౌలింగ్
- Advertisement -
- Advertisement -