Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోశాలలో ఆధ్యాత్మిక శోభ

గోశాలలో ఆధ్యాత్మిక శోభ

- Advertisement -

కార్తీక మాసం మన భోజన కార్యక్రమం 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 

యాదగిరిగుట్ట దేవస్థాన గోశాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గురువారం, యాదగిరిగుట్ట మల్లాపురం, దేవస్థానం గోశాలలో తులసీ దామోదర కల్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ పవిత్ర కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత సంవత్సరం గోశాలలో ఎస్పీఎఫ్  ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. ఆ నాటి నుంచి, ఆ మొక్కల పెంపకం, వాటి పూర్తి బాధ్యతను ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తోంది. కార్యక్రమం అనంతరం వనమహోత్సవానికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎన్ శ్రీనాథ్, ఏసీపీ శ్రీనివాస నాయుడు, సీఎస్ఓ కే శేషగిరి రావు, ఆలయ, ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -