– తలోదారి ఎంచుకున్న మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు..
– రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఎదురీత తప్పదంటున్న పరిశీలకులు..
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలోదారి ఎంచుకోవడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు తలనొప్పిగా మారింది. సీనియర్ నాయకులు ఒక్కొక్కరు పక్కకు తప్పుకోవడంతో వేరే కుంపటి పెట్టి ఎమ్మెల్యే కి సవాలు విసిరే విధంగా వారు ప్రవర్తించడం విడ్డూరంగా పార్టీ మారింది. కొంతమంది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు లోలోన సంతోషంగా ఉన్నప్పటికీ బయటికి మాత్రం నిరాశ నిష్ప్రహత కోల్పోయినట్టు కనిపిస్తోంది. ఇంకొంతమంది జూనియర్ కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదు. కొన్ని వివాదాల పరిష్కరించక పోవడంతో ఎమ్మెల్యేతో కలిసి ఉండలేక, తమకు సంబంధించిన నాయకుల కార్యకర్తల పనులు చేయడం లేదని, నిలిచిపోయిన పాత బిల్లులు రావడంలేదని, కొత్త పాత వారికి సఖ్యత లేకపోవడంతో, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పి గ్యాప్ ( అంతర్యం) రావడానికి కారణం అవుతున్నారు.
కాంగ్రెస్ పాత నాయకుల గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ నాయకులను కలిసిన ప్రస్తుత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకులు ఇకపై తమ వెంట ఉంటామని వారితో చట్టపట్టలేసుకొని మండలంలో ఇప్పటికే తిరగడం ప్రారంభించారు. కొంత మంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గంగారం తో కలిసి వారితోనే ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకో లేని దెబ్బ వస్తుందో ఏమని కొంతమంది నాయకులు భావిన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భిన్నమైన విజయాలు వచ్చే అవకాశాలు ఉంటాయని , కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి నాయకులు నిర్లక్ష్యం వలన పార్టీ పటిష్టత కోల్పోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో అటు రైతులు ఇటు కర్షకులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్క వర్గం వారు పార్టీ పైన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. రాబోయే రోజులలో పార్టీ కనుమరుగై నామరూపాలు లేకుండా పోయే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి.
దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు కొనసాగీస్తూనే వారు వేసే పాచికలు తలోగ్గి, అవమానపాలు అయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం జుక్కల్ కాంగ్రెస్ నాయకులతో చర్చించి అందరిని ఒకతాటి పై తీసుకువచ్చి నాయకుల మధ్య సఖ్యత ఏర్పడే విధంగా వేదిక నిర్వహించి, అలిగిపోయిన వారిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తే రాబోయే నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదని, ఎటువంటి ధోకా ఉండదని ప్రజలలో చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల ఫలితాలు నిదర్శనగా తీసు కోవాలని అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని మండల వాసులు అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల దృశ్య రాష్ట్రం లో బీసీ రిజర్వేషన్లు 42శాతం ప్రకటించడం ప్రజల్లో బీసి వార్గాలలో సంతోషం నెలకొంది . ప్రత్యేకంగా జుక్కల్ నియోజకవర్గంలో రిజర్వేషన్లను ప్రకటించడం పట్ల ప్రజల్లో రహస్యం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని ఏండ్లుగా ఉన్నత వర్గాల వారికి రిజర్వేషన్లు ప్రకటిస్తూ పేద వర్గాల వారికి కిందిస్థాయి నాయకులు అవకాశం లేకుండా పోవడంతో నిరాశ నిష్పలతో ఉన్న గ్రామస్థాయి నాయకులు ప్రస్తుతం రిజర్వేషన్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాలలో మండలాలలో ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచ్ లు రిజర్వేషన్లు ప్రజల్లో ఓటర్లలో ఆసక్తి నెలకొంది. గత 70 ఏళ్ల చరిత్రలో ఇంత మంచి రిజర్వేషన్లు ప్రతి ఒక్క వర్గాల వారికి అవకాశం లభించే విధంగా రిజర్వేషన్లు రావాలని పాత ముదురులకు గుండెల్లో గూబుల్ లేపుతోంది. ఎక్కడ తమ పదవికి ఎసరు వస్తుందో వారు లోలోన మదన పడుతూ బయట కొంటెద్దు కూడా లేకపోతున్నారు. వచ్చిన నాటి నుండి అధికార పార్టీలో చేరి ఇప్పటికీ తానే నాయకులుగా ఉండాలని పాచికలు వేసినప్పడికి వారి ఆశలు తలకిందైంది. ఉన్న పార్టీని వదిలి అధికార పార్టీలో వచ్చిన ఎదురీత తప్పకపోవడంతో మౌనం వహిస్తున్నారు. ఇప్పటికైనా మండల స్థాయిలో ఇప్పటికి పలు పదవులు అలంకరించిన మధుర నాయకులు తప్పకుండా బాగుంటుందని మండల ప్రజ లు చర్చించుకుంటున్నారు.