Wednesday, November 19, 2025
E-PAPER
Homeఖమ్మంస్పాంజ్ ఐరన్ పరిశ్రమను వెంటనే ప్రారంభించాలి

స్పాంజ్ ఐరన్ పరిశ్రమను వెంటనే ప్రారంభించాలి

- Advertisement -

– తెదేపా నాయకులు కట్రం
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని  పాల్వంచలో మూతపడిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తిరిగి పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్టీ అశ్వారావుపేట నియోజక వర్గం నాయకులు కట్రం స్వామి దొర డిమాండ్ చేసారు. ఆయన బుధవారం అశ్వారావుపేట లో విలేఖర్లతో మాట్లాడారు.

నాటి ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు 1976 లో స్పాన్ ఐరన్ ఇండియా లిమిటెడ్ ని,కేంద్ర ప్రభుత్వం అనుసంధానంలో నిర్మించారని  1980 నుండి ఉత్పత్తి ప్రారంభించి ఎంతో మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి కల్పించడంతో పాడు అంతర్జాతీయ మారకద్రవ్యాన్ని తెచ్చిపెట్టింది అన్నారు.

అనంతరం 2010 లో ఎన్ఎండీ లోకి విలీనం చేసారని తెలిపారు.నేడు ఆ పరిశ్రమ మూత పడటంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు అని అన్నారు.  ఈ ప్రాంతం మొత్తం ఏజెన్సీ కాబట్టి వెంటనే  ఫ్యాక్టరీ ని పునర్నిర్మానం చేసి ఇక్కడ ప్రజలకు జీవనోపాధి కల్పించి, గతంలో పనిచేసిన ఉద్యోగస్తులకు పెన్షన్ కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు,  ఎంపీలు కూడా దీనిపై దృష్టి సారించి వెంటనే ప్రారంభించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు, ఉదయ్ కుమార్,అంకోలు వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -