Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాన్సువాడలో చెదురుమదురు ఘటనలు

బాన్సువాడలో చెదురుమదురు ఘటనలు

- Advertisement -


నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్
చెదురుమదురు ఘటనల మధ్య బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు 73.66% పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. బాన్సువాడ ఉదయం మందకొండగా సాగిన మధ్యాహ్నం వరకు 50శాతంతో సాయంత్రానికి మరింత శాతం పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఆశించినట్లు  ఓట్ల శాతం పెరిగింది.  చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని పోలీసులు చెప్పారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి కోరారు. పట్టణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ కొడుకు మధ్య వాగ్వాదంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పాత బాన్సువాడలో పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినట్లు పలు పార్టీ నాయకులు  ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్ఐ జోక్యం చేసుకొని ఇరు పార్టీ కార్యకర్తలను చెదర గొట్టరు. అక్కడ ఘర్షణ లు జరగడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఉదయం జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ లు కూలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు చదివినగం చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఫిబ్రవరి 13వ తేదీన చేపడుతారు. ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపాలిటీల చైర్మన్ వైస్‌ ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు ఉంటాయి. గెలుపొందిన వార్డు సభ్యులు ఓట్లు వేసి ఎన్నుకోవాల్సి ఉంటుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -