– క్రికెట్ ప్రతిభ కనబరిచిన బాలికలు
– పరుగులో సత్తా చాటిన అశ్వారావుపేట విద్యార్ధులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం అంతర్ కళాశాల విద్యార్ధులు క్రీడలు లో భాగంగా స్థానిక వ్యవసాయ కళాశాలలో శనివారం ప్రారంభం అయిన అగ్రి స్పోర్ట్స్ మీట్ – 2026 లో విద్యార్ధులు రెండో రోజు సోమవారం ఉత్సాహభరితంగా ఆడి వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. పరుగుపందెంలో అశ్వారావుపేట విద్యార్ధులు ప్రతిభ కనబరచ గా,మొదటి సారిగా క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ బాలికలు తమ సత్తా చాటారు.
ఖో ఖో….
బాలురు విభాగంలో జగిత్యాల – వరంగల్ తలపడి వరంగల్ విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో అశ్వారావుపేట – రాజేంద్రనగర్ పోటీపడి అశ్వారావుపేట గెలుపొందింది.
వాలీ బాల్…
బాలురు విభాగంలో అశ్వారావుపేట – వరంగల్ పోటిపడి అశ్వారావుపేట విజయం సాధించింది. బాలికల విభాగంలో సైఫాబాద్ – అశ్వారావుపేట తలపడి సైఫాబాద్ గెలుపొందింది. ఆదిలాబాద్ – జగిత్యాల తలపడి జగిత్యాల విజయం సాధించింది.
బాస్కెట్ బాల్….
బాలురు విభాగంలో సంగారెడ్డి – రాజేంద్రనగర్ పోటీపడి రాజేంద్రనగర్ గెలుపొందింది.
ఫుట్ బాల్….
బాలురు విభాగంలో సిరిసిల్లా – పాలెం తలపడి పాలెం గెలుపొందింది.
క్రికెట్….
బాలురు విభాగంలో జగిత్యాల – పాలెం తలపడి జగిత్యాల గెలుపొందింది. బాలికల విభాగంలో రుద్రూరు – ఆదిలాబాద్ తలపడి ఆదిలాబాద్ విజయం సాధించింది.
టెన్నికాయిట్…..
బాలికల విభాగంలో సిరిసిల్ల – అశ్వారావుపేట తలపడి అశ్వారావుపేట విజయం సాధించింది. రుద్రూరు – అశ్వారావుపేట పోటీపడి అశ్వారావుపేట గెలుపొందింది. జగిత్యాల – రాజేంద్రనగర్ తలపడి జగిత్యాల విజేతగా నిలిచింది.
100 మీటర్ల పరుగులో…
బాలురు విభాగంలో అశ్వారావుపేట,బాలికలు విభాగంలో రాజేంద్రనగర్ ప్రధమ స్థానంలో నిలిచారు.
400 మీటర్ల పరుగులో…
బాలురు విభాగంలో అశ్వారావుపేట,బాలికలు విభాగంలో అశ్వారావుపేట మొదటి స్థానంలో నిలిచారు.



