Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో క్రీడలకు పెద్దపీట..! 

పల్లెల్లో క్రీడలకు పెద్దపీట..! 

- Advertisement -

– సీఎం కప్ క్రీడలకు సన్నాహాలు..!
నవతెలంగాణ – మల్హర్ రావు

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల-జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామ స్థాయి, 28 నుంచి 31 వరకు మండల, 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయి.10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి.ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది.ఈసారి చిన్నారులు. ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు.
వివిధ క్రీడాంశాల్లో పోటీలు..
సీఎం కప్ లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి.అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సిం గ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీ బాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్క్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్,కనోయింగ్-కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బేల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్బ్యాడ్మిం టన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -