Saturday, January 24, 2026
E-PAPER
Homeమహబూబ్ నగర్లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి

లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చ‌ట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు.. దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మెలో భాగంగా.. శనివారం పంచాయతీ కార్మికులు ఎంపీడీవో గీతాంజలి సమ్మె నోటీసులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక పారిశ్రామిక విధానాల పట్ల ప్రజలు కార్మిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గ్రామపంచాయతీ వర్కర్ల పెండింగ్ జీతాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కుల సంఘం మండల అధ్యక్షులు జంగయ్య, బాలస్వామి, వెంకటయ్య, కృష్ణయ్య, అచలయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -