ఎంఈఓ విజయ్ కుమార్.. మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ..
నవతెలంగాణ – జన్నారం
క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసికొల్లాసాన్ని కలిగిస్తాయని జన్నారం ఎంఈఓ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండలంలో ఎస్ఎఫ్జి అండర్-17 బాలుర వాలీబాల్ ఎంపిక పోటీలను స్లేట్ ఎక్సలెంట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజయకుమార్ మాట్లాడుతూ.. వ్యాయామం మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే శరీరంలోని ప్రతి అవయవం చురుకుగా పనిచేస్తుంది. క్రీడల ద్వారా మనం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండగలుగుతామని పేర్కొన్నారు.
స్లేట్ గ్రూప్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు జన్నారం మండలంలో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. క్రీడల్లో గెలుపోటములు సహజం. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మంచి ఫలితాలు సాధించాలి” అని శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ లక్ష్మీనారాయణ, జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష, స్లేట్ గ్రూప్ చైర్మన్ ఎ. శ్రీకాంత్ రెడ్డి, స్లేట్ గ్రూప్ ఫౌండర్ ఏనుగు సుభాష్ రెడ్డి, స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు శ్యామ్లాల్, సిరిన్ ఖాన్, ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ యాకూబ్, అబ్జర్వర్ పనిరాజ, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు బెల్లం శీను, గాజుల శీను, సిరంగి గోపాల్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రోజి వర కుమారి, సాగర్, అలాగే పీడీలు సంతోష్, నగేష్, జోష్ణ, శంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.