నవతెలంగాణ – ముధోల్
క్రీడా పోటీలో క్రీడాకారులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని తెలంగాణ జనసమితి ముధోల్ నియోజకవర్గం ఇంచార్జి సర్దార్ వినోద్ కుమార్, సర్పంచ్ నక్క మల్లేష్ లు అన్నారు. ముధోల్ మండలంలోని రువ్వి గ్రామంలో అట్టహాసంగా క్రికెట్ క్రీడ మ్యాచ్ పోటీలను శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. క్రీడా పోటీల వల్ల పోటీతత్వం పెరుగుతుంది అన్నారు. క్రీడా లు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో గన్నోర, బ్రహ్మన్ గావ్ సర్పంచులు అప్పల రాజు,మల్కనోల్ల మహేందర్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ సర్ధార్ కునాల్ ,వార్డు సభ్యులు రాథోడ్ భీమ్ రావు,సర్దోల్ల దిగంబర్, గ్రామ పెద్దలు మధ్యల భోజన్న,ముడుగుల సత్య నారాయణ,సర్దోల్ల దేవిదాస్,పెద్ద కాపు దేవన్న,నక్క హన్మండ్లు, సర్దోల్ల తిరుపతి,జంగం మల్లేష్,క్రీడాకారులు జాదవ్ పీరు సింగ్, పాంచాల్ విలాస్,రమేష్,సంతోష్,ఉమా చరణ్, వెంకట్,రవి,మహేష్,సాయి కుమార్ సావుల మహేష్, నక్క దశరథ్, గ్రామస్తులు,యువ క్రీడా కారులు వివిధ గ్రామాల యువ క్రీడా కారులు పాల్గొన్నారు.



