నవతెలంగాణ – ఆర్మూర్
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బార్ న్యాయవాదులకు ఆటల పోటీలను నిర్వహించినారు. సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి , గౌరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ సరళ రాణిలు విచ్చేసి ఆటల పోటీలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, తులసీదాస్ క్రాంతి, ఎంకే నరేందర్, చిలుక కిష్టయ్య, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గటడి ఆనంద్, లైబ్రరీ సెక్రెటరీ శ్రావణ్ కుందారం, న్యాయవాదులు పోచన్న,తాజొద్దీన్, రాము,అశోక్ ఐనారి, జి జి రాములు, బాలయ్య, ఎంకె నాగరాజు, దాస్, కిరణ్,శ్యామ్ యాదవ్, సురేష్, నందిన్ తదితరులు పాల్గొన్నారు.