– ఫైనల్ కు చేరిన పలు జట్లు
– ఖోఖో లో సత్తా చాటిన అశ్వారావుపేట విద్యార్ధులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం అంతర్ కళాశాల విద్యార్ధులు క్రీడలు లో భాగంగా స్థానిక వ్యవసాయ కళాశాలలో శనివారం ప్రారంభం అయిన అగ్రి స్పోర్ట్స్ మీట్ – 2026 లో విద్యార్ధులు మూడో రోజు మంగళవారం ఉత్సాహభరితంగా ఆడి వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
ఖో ఖో అశ్వారావుపేట విద్యార్ధులు ప్రతిభ కనబరిచారు.
ఫైనల్ గా…
టెన్నికాయిట్
బాలురు విభాగంలో అశ్వారావుపేట – సైఫాబాద్ పోటీపడి అశ్వారావుపేట విజయం సాధించింది.
బాస్కెట్ బాల్ లో అశ్వారావుపేట – వరంగల్ తలపడి అశ్వారావుపేట విజయం సాధించింది.
ఖో ఖో…
బాలురు విభాగంలో అశ్వారావుపేట – ఆదిలాబాద్ పోటీపడి అశ్వారావుపేట గెలుపొందింది.
చదరంగంలో…
బాలికల విభాగంలో వరంగల్ – రాజేంద్రనగర్ తలపడి వరంగల్ గెలుపొందింది.
బాలురు విభాగంలో జగిత్యాల – వరంగల్ పోటీపడి జగిత్యాల విజేతగా నిలిచింది.

జావెలిన్ త్రో లో…
ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాల్లో సిరిసిల్ల,సిరిసిల్ల,ఆదిలాబాద్ నిలిచాయి.
డిస్క్ త్రో లో…
సంగారెడ్డి,రాజేంద్రనగర్,రాజేం
సెమీ ఫైనల్ లో..
వాలీబాల్ లో బాలురు విభాగంలో జగిత్యాల – రాజేంద్రనగర్ లు,
బాస్కెట్ బాల్ లో రాజేంద్రనగర్ – పాలెం లు సెమీఫైనల్ కు చేరాయి.



