– ఎంఈఓ ఎర్ర లక్ష్మీ
నవతెలంగాణ – ఆలేరు రూరల్
మానసిక, శారీరక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆలేరు మండల విద్యాధికారి (ఎంఈఓ) ఎర్ర లక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆలేరు మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను కొలనుపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ( ఇంచార్జ్ ) డి.సత్యవతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ ఎర్ర లక్ష్మీ మాట్లాడుతూ.. “క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. సీఎం కప్‌ను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి” అని సూచించారు. ఈ క్రీడోత్సవాల్లో మూడు విభాగాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గడసంతల మధుసూదన్,మాదాని జోసెఫ్,పూల నాగయ్య,కవిత,రిటా వసంతకుమారి,చంద్రకుమార్,సందీప్, శివాజీ తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.




