Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఈ నెల 22 నుంచి హైటెక్స్‌లో స్పోర్ట్స్‌ ఎక్స్‌పో

ఈ నెల 22 నుంచి హైటెక్స్‌లో స్పోర్ట్స్‌ ఎక్స్‌పో

- Advertisement -

హైదరాబాద్‌ : స్పోర్ట్స్‌ ఎక్స్‌పో ఇండియా 8వ ఎడిషన్‌ ఆగస్ట్‌ 22, 23 తేదీల్లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరగనుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైటెక్స్‌ బిజినెస్‌ హెడ్‌ టిజి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌పో దేశంలోని ప్రముఖ బి2సి క్రీడలు, ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌, న్యూట్రిషన్‌ రంగాల ఈవెంట్‌గా నిలుస్తుందన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా ఈ-స్పోర్ట్స్‌ ఎక్స్‌ పావిలియన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నామన్నారు. దాదాపు 35వేల నుంచి 40వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. క్రీడా ఔత్సాహికులకు, ఫిట్‌నెస్‌ ప్రియులకు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad