నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని ఎంపీయూపీఎస్ ధర్మారం స్కూల్ లో పిల్లలు క్రీడా రంగంలో ముందుకు వెళ్లాలని, చదువుతో పాటు క్రీడా కార్యక్రమాలు కూడా చాలా అవసరం అని ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మగ్గిడి తిరుపతి అన్నారు. సోమవారం గల్ఫ్ స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ ధర్మారం నుండి పిల్లలకు స్పోర్ట్స్ కిట్ అందించామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆయన మాట్లాడుతూ.. గత 48 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న అటెండర్ నారాయణ, పిల్లలకు, భోజనాలు పెడుతూ సేవలందిస్తున్న మగ్గిడి లచక్క, చిట్యాల విజయ లను ఘనంగా సన్మానించామని వెల్లడించారు. అనంతరం హెడ్ మాస్టర్ వెంబడి సత్తన్నా, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది, అందరూ కలిసి గల్ఫ్ స్వచంధ సేవ పౌండేషన్ ధర్మారం సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు రాచకొండ రాజేష్, నమిలకోడ కాంతారావు, చిట్యాల రాజు, తడకపెల్లి వరుణ్, గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది గల్ఫ్ స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ ధర్మారం వారిని అభినందించారు.
విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



