- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ హైస్కూల్ విద్యార్థులకు కలిగోట్ గ్రామానికి చెందిన యూసుఫ్ ఉట్నూర్ మహేందర్ 20000 వేల రూపాయల క్రీడా దుస్తులను డొనేట్ చేయడం జరిగింది. ఈ క్రీడా దుస్తులను ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమాచారి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వప్న చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూసుఫ్ మరియు ఉట్నూర్ మహేందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.
- Advertisement -