నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ రక్షక్ టీం సభ్యులకు క్రీడా దుస్తులను కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అందజేత అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బిగ్ బాస్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న పోలీస్ రక్షక్ టీం సభ్యులకు పలువురు దాతల ఆర్థిక సహకారంతో క్రీడా దుస్తులను కొనుగోలు చేశారు. ఈ క్రీడా దుస్తుల కోసం మండల కేంద్రానికి చెందిన టీవీఎస్ షోరూం యజమాని ధరిణి, పన్నాల రవి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు శైలేందర్, గుండోజి భరద్వాజ్ ఆర్థిక సహాయం అందజేశారు. వారు అందించిన ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసిన క్రీడా దుస్తులను ఎస్ఐ అనిల్ రెడ్డి చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు. బిగ్ బాస్ లీగ్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల క్రీడా దుస్తుల కోసం ఆర్థిక సహాయం అందించిన దాతలకు ఈ సందర్భంగా పోలీస్ రక్షక్ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీస్ రక్షక్ టీం సభ్యులకు క్రీడా దుస్తుల అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES