Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లి ఐటిఐలో స్పాట్ అడ్మిషన్లు 

కమ్మర్ పల్లి ఐటిఐలో స్పాట్ అడ్మిషన్లు 

- Advertisement -

– ఐటిఐ ప్రిన్సిపాల్ కోటిరెడ్డి 
– ఈనెల 6 నుండి 28వ తేదీ వరకు అవకాశం 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ, ప్రభుత్వ ఐటిఐ కమ్మర్ పల్లి(బషీరాబాద్)  లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను వాక్ ఇన్ (స్పాట్) అడ్మిషన్లు ఈనెల 6 నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు  కమ్మర్ పల్లి ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ ఎం. కోటిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, వెల్డర్, కోప, డ్రెస్ మేకింగ్ తోపాటు అధునాతన కోర్స్  అయినా మానుఫక్టురింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మానుఫక్టురింగ్, ఆర్తిసన్  యూజింగ్ అడ్వాన్స్ టూల్స్, అడ్వాన్స్డ్ సిఎన్ సి మిసినింగ్ టెక్నీషియన్స్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ట్రేడ్స్ లలో వాక్ ఇన్ (స్పాట్) అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు.

పదవ తరగతి పాసైన, ఇంటర్ పాసైన/ ఫెయిల్ అయిన, పై చదువులు చదువుతున్న విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశమని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సర్టిఫికెట్ తో ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, మా డిపార్ట్మెంట్ ( టామ్ కం) ద్వారా ట్రైనింగ్, ఇతర దేశాల భాషలు నేర్పించి ఇంటర్వ్యూ ద్వారా పంపించడం జరుగుతుందని తెలిపారు. ఐటిఐ పాసైన విద్యార్థులకు జాబ్ మేళా ద్వారా గ్యారెంటీ జాబు ఇవ్వడం జరుగుతుందని, సుమారు రూ. 20వేల వరకు జీతం వస్తుందని తెలిపారు.నిజామాబాద్ జిల్లా ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలోని మీసేవ కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను స్కాన్ చేసి వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. అప్లై చేసేముందు పదవ తరగతి మెమో ప్రకారం పేరు, పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఉండేలా చూసుకోవాలన్నారు. 

అడ్మిషన్ కావాలనుకునే వాళ్ళు www.iti.telangana.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకొని ప్రభుత్వ ఐటిఐ కమ్మర్ పల్లి(బషీరాబాద్)కి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య హాజరుకావాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సీట్ల ఎంపిక జరుగుతుందని తెలిపారు.ఈనెల 28వ తేదీతో అడ్మిషన్ల  గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. ఇదివరకే ఆన్ లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్లు డైరెక్ట్ గా స్పాట్ అడ్మిషన్కు హాజరుకావాలని సూచించారు.

అప్లై చేసేటప్పుడు నమోదు చేసుకునే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఐటిఐ కోర్స్ పూర్తయ్యేవరకు ఉండాలన్నారు. మొబైల్ నెంబర్ మారిస్తే అడ్మిషన్ రద్దు అవుతుందని వివరించారు. 16 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు అర్హులని, వయోపరిమితి లేదని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని ఐటిఐ ప్రిన్సిపాల్ కోటిరెడ్డి పేర్కొన్నారు.కోర్సుల వివరాలు, విద్యా అర్హతల కోసం www.iti.telangana.gov.in చూడాలని సూచించారు. ఇతర వివరాల కొరకు 8500466380, 8106794500 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -