నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ మరియు అడ్మిషన్స్ కన్వీనర్ టీజీఇఎపీసిఇటి -2025 ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 26,28మరియు 29 తేదీల్లో అర్హులైన అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నాట్లు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ అరతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ) కంప్యూటర్ సైన్స్( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) కంప్యూటర్ సైన్స్( డాటా సైన్స్) కోర్సులలో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చును.
స్పాట్ అడ్మిషన్స్ పొందే అభ్యర్థులు టిఇ ఏపీసిఇటి -2025 పరీక్ష రాసిన వారు మరియు ఇంటర్మీడియట్( ఎం పి సి ) తత్సమాన పరీక్ష యందు ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చును. ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీట్లు అలట్ అయినవారు ఈ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనరాదు. ఈ డబ్ల్యూఎస్ కోట నిబంధనలు స్పాట్ అడ్మిషన్ ద్వారా నింపరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. స్పాట్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ లో చూడగలరు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించాలని కోరారు.
యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES