- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల యందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, గ్రూపులో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 31న స్పాట్ అడ్మిషన్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ డి. బాలస్వామి మంగళవారం తెలిపారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రకారం అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31వ గురువారం ఉదయం 9 గంటల నుండి1:00 వరకు కళాశాల యందు పేరు నమోదు చేసుకోవాలని సు సు సూచించారు. విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వచ్చి స్పాట్ అడ్మిషన్లు పొందాలని సూచించారు.
- Advertisement -