Sunday, July 6, 2025
E-PAPER
Homeఖమ్మంవిస్తరిస్తున్న జ్వరాలు..

విస్తరిస్తున్న జ్వరాలు..

- Advertisement -
  • – గుంటిమడుగులో ఒకరికి డెంగ్యూ
    – చర్యలు చేపడుతున్నాం: డాక్టర్ రాందాస్
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • మండలంలో రోజు రోజు కూ జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఇటీవల మండలంలోని రెడ్డిగూడెంలో వేర్వేరు రోగ కారణాలతో ఇరువురు మృతి చెందడంతో జిల్లా అధికార బృందం అశ్వారావుపేట మండలం పై దృష్టి సారించి పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపడుతున్నారు. అయినా శనివారం మండలంలోని కోయ రంగాపురం పంచాయితి గుంటిమడుగు కు చెందిన 48 ఏళ్ళ బిట్టా బాబు కు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే తగు చర్యలు చేపట్టాలని సంబంధిత కార్యదర్శి కార్తీక్ కు,వినాయక పురం ప్రాధమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ రాందాస్ కు హెచ్చరికలు జారీ చేసారు.

  • వివరాలు ఇలా ఉన్నాయి
    గుంటిమడుగు వాసి బిట్టా బాబు గత మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో వినాయక పురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షించిన వైద్యులు సాదారణ వైరల్ జ్వరంగా భావించి చికిత్స అందించి మందులు ఇచ్చి పంపారు. రెండో రోజు తిరిగి జ్వరం రావడంతో వినాయక పురం లోని ఓ ప్రయివేట్ రక్త పరీక్షా కేంద్రంలో ఈ నెల 4 వ, తేదీ శుక్రవారం జ్వర నిర్ధారణ రక్త పరీక్ష చేయించుకున్నాడు. అదే పరీక్ష నిర్ధారణతో మళ్ళీ వినాయక పురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు.
  • ఇక్కడ వైద్య సిబ్బంది రక్త నమూనా సేకరించి టీ హబ్ కు పంపితే అక్కడ డెంగ్యూ గా నిర్ధారణ అయింది.దీంతో జిల్లా వైద్యాధికారులు స్థానిక వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు. ఈ విషయం అయి డాక్టర్ రాందాస్ ను వివరణ కోరగా డెంగ్యూ నిర్ధారణ అయిందని, అయితే రోగి ఆరోగ్యంగానే ఉన్నాడని, ఆ గ్రామంలో ఆదివారం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జ్వర పీడితుడు బాబూరావు మాట్లాడుతూ మందులు వేసుకుంటున్నాను అని, ప్రస్తుతం ప్రాణం మెరుగ్గానే ఉందని తెలిపాడు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -