నవతెలంగాణ – కామారెడ్డి: ఎస్సార్ ఫౌండేషన్(సుభాష్ రెడ్డి) ద్వారా బుధవారం జనగామ గ్రామనికి చెందిన భ్యాగరి జ్యోతి వివాహానికి రూ.25000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. తల్లి తండ్రిని చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు మృతి చెందడంతో తన ముగ్గురు చెల్లెళ్లకు తనే తల్లి తండ్రియై ముగ్గురి చెల్లెళ్ళ పెంచి పెద్ద చేసి చదివించి వివాహం జరిపించిన తరువాత చివరిగా జ్యోతి వివాహం చేసుకోవడం నేటి సమాజంలో పలువురికి ఆదర్శంగా ఈమె నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు, బిబిపేట మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ కప్పిర రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజి వార్డ్ మెంబర్ బోధస్ సాయికుమార్, అశోక్ గౌడ్, పాత ప్రవీణ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
పేదింటి వివాహానికి ఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES