Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రావణిది.. కులదురహంకార హత్యే

శ్రావణిది.. కులదురహంకార హత్యే

- Advertisement -

– నిందితులను కఠినంగా శిక్షించాలి
– మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి : టీఏజీఎస్‌, కేవీపీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తలండి శ్రావణి హత్య కులదురహంకార హత్యేననీ, హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివాసి గిరిజన సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు టీఏజీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిడియం బాబూరావు, పూసం సచిన్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహేగాం మండలంలోని గెర్రే గ్రామంలో శివార్ల సత్తయ్య కొడుకు కులం తక్కువ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడని కక్షపూరితంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో కోడలు శ్రావణిపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడని తెలిపారు. ఈ హత్యను కుల దురహంకార హత్యగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సత్తయ్య కుటుంబ ఉంటున్న స్థలం ప్రభుత్వ స్థలమనీ, దీనిని శ్రావణి కుటుంబానికి ఇవ్వాలని గ్రామస్తులు సూచించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -