నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని శ్రీ కొండ లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన కేంద్రంలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో పరిశోధ కేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మహేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలన్నారు. ఈరోజు మనం నాటే మొక్కలే వృక్షాలై భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును అందిస్తాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతలను కూడా చేపట్టాలని ప్రజలకు సూచించారు. పసుపు పరిశోధన కేంద్రం పరిధిలో దాదాపు 200 మొక్కలను నాటినట్లు ఆయన తెలిపారు. నాటిన మొక్కల సంరక్షణకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీనివాస్, పరిశోధన కేంద్రం సిబ్బంది, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
పసుపు పరిశోధన కేంద్రంలో వన మహోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES