– అకడమిక్ డైరెక్టర్ సుష్మ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఎప్‌సెట్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఎప్‌సెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాల్లో ఎప్పటిలాగే తమ విద్యార్థులు రికార్డ్స్ క్రియేట్ చేశారని తెలిపారు. ఇంజనీరింగ్‌లో 10లోపు ఆరు ర్యాంకులు, టాప్ 100లోపు 50 ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు. అగ్రి, ఫార్మాలో టాప్ 10లోపు ఏడు ర్యాంకులు, టాప్ 20లోపు 17 ర్యాంకులు, టాప్ 100లోపు 70 ర్యాంకులు రావడం ఒక శ్రీచైతన్యకే సాధ్యమని వివరించారు. మెడికల్‌లోనూ తమ సంస్థకు పోటీ లేదని విద్యార్థులు మరోసారి నిరూపించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకటి, రెండు సార్లు కాదనీ, ఏకంగా ఏడు సార్లు స్టేట్ ర్యాంకులు సాధించి శ్రీచైతన్య విజయ పరంపర కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ మొయిన్స్-2025 ఫలితాల్లో కూడా 300 మార్కులకుగానూ 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది శ్రీచైతన్య విద్యార్థేనని గుర్తు చేశారు. రాబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్‌లో కూడా తమ విద్యార్థులు విజయ దుందుభి మోగిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అత్యుత్తమ ఫలితాల వెనుక శ్రీచైతన్య సృష్టించిన అనితర సాధ్యమైన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములు, ఇంటర్నల్ టెస్ట్ పేపర్లు, స్టూడెంట్ టీచర్, వన్ టు వన్ అడాప్షన్ సిస్టవ్‌తో నిపుణులైన అధ్యాపక బృందం శిక్షణ కీలకంగా నిలిచాయని వివరించారు.
ఎప్‌సెట్‌లో శ్రీచైతన్య విద్యార్థుల విజయభేరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES