- పాల్గొన్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు
నవతెలంగాణ-మోపాల్: నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో “శ్రీ గోదా రంగనాథ” కళ్యాణం కన్నుల పండుగా జరిగింది. అమ్మవారి కళ్యాణ వేడుకల్లో దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు. నేడు గోదా కళ్యాణంతో పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్టతో “శ్రీ వ్రతం” చేసి రంగానాథుడిని కళ్యాణమాడి వారిలో లీనమైందని తెలిపారు. ధనుర్మాసంలో “తిరుప్పావై” పఠనం మనకు వైకుంఠ నాధుడిని హృదయానికి చేరువ చేస్తుందని అన్నారు.
గ్రామస్థులు, చుట్టు పక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రోహిత్ కుమారాచార్య, విజయ్ స్వామి, ఆలయ ధర్మకర్తలు శ్రీమాన్ దిల్ రాజు దంపతులు, శ్రీమాన్ నర్సింహ రెడ్డి దంపతులు, నర్సారెడ్డి, రమేష్, నరాల సుధాకర్ దంపతులు, ప్రసాద్ భాస్కర్, మురళి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.



