- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ఈనెల 14వ తేదీ బుధవారం శ్రీ గోదారంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్షిక ఏకాదశి(అష్టమ) హోమం, ఉత్సవమూర్తులకు అభిషేకాలు, పుష్పార్చన, కళ్యాణం అనంతరం ఊరేగింపు, తీర్థ ప్రసాదాల వితరణ జరగనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -



