నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలలో శ్రీకృష్ణుడు జన్మించిన రోజును పురస్కరించుకొని కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులను గోపిక, కృష్ణుడు వేషధారణలో అందంగా ముస్తాబు చేసి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు. పాఠశాల ఆవరణంలో గోపిక, కృష్ణుడు వేషధారణలో ఉన్న విద్యార్థులతో నృత్యాలు చేయించారు.అనంతరం ఉట్టికట్టి కృష్ణుడి వేషధారణలో ఉన్న విద్యార్థులతో ఉట్టిని కొట్టించారు. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న విద్యార్థులు ఉట్టిని కొట్టేందుకు పోటీ పడుతుండగా తోటి విద్యార్థులు నీటిని చిమ్మారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థుల కేరింతల మధ్య పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సంబురంగా కొనసాగాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గుండోజి దేవేందర్, పాఠశాలలో ప్రిన్సిపాల్ సౌమ్య, ఉపాధ్యాయ బృందం సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES