నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 11న శ్రీలక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగారామస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.11వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు గ్రామ అభివృద్ధి కమిటి, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమృత ధార ఆశ్రమానికి చెందిన నారాయణ స్వామిజీ సమక్షంలో శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవ నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అందరూ కల్యాణానికి విచ్చేసి స్వామి వారి అనుగ్రహం పొందాలని ప్రకటనలు కోరారు. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య రక్షలు, పెళ్లి కోసం కళ్యాణ రక్షలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.శ్రీలక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదలచిన భక్తులు అందరు సమయపాలన పాటించాలని సూచించారు.
11న శ్రీలక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES