నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్ పల్లి కమాండెంట్ దంపతులు భవాని సత్యనారాయణ ఆధ్వర్యంలో బెటాలియన్ ఆవరణలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య వాహనము, వసంతోత్సవం, డోలోత్సవం మరియు బలిహరణం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5:00 గంటలకు సామూహిక శ్రీ లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ కమాండెంట్ సిహెచ్ సాంబశివరావు దంపతులు, అసిస్టెంట్ కమాండెంట్స్ కె.పి శరత్ కుమార్, కె.పి సత్యనారాయణ, ఆర్ ఎస్ ఐ లు , సిబ్బంది, కుటుంబ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
7వ బెటాలియన్ లో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES