నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్‌ను బుధవారం శ్రీలంక మీడియా ప్రతినిధులు సందర్శించారు. వారం రోజులుగా హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 29 మంది శ్రీలంక మీడియా ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్‌ను చేరుకున్న సందర్భంగా వారికి సాగర్ సిఐ శ్రీను నాయక్, ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునకొండ పురావస్తు ఐలాండ్ మ్యూజియాన్ని సందర్శించారు.
నాగార్జున కొండపై ఉన్న మూడవ శతాబ్దం నాటి సింహాళ విహారాన్ని (శ్రీలంక) సందర్శించారు. 1800 సంవత్సరాల క్రితమే భారతదేశానికి, శ్రీలంకకి ఉన్న అనుబంధం గురించి తెలుసుకొని సింహళ విహారంలోని బుద్ధ విగ్రహం వద్ద ఫొటోలు దిగారు. అనంతరం వీరు బుద్ధవనం సందర్శించారు. మహస్తూపంలోని సమావేశ మందిరంలో బుద్ధ వనం విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మహాస్తూపం ధ్యాన మందిరంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు వీరిచే ధ్యానం చేయించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునకొండ, నాగార్జునసాగర్ డ్యాం, బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరితోపాటు స్థానిక ఎస్‌ఐ ముత్తయ్య , పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సాగర్‌ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



