- Advertisement -
న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అభివృద్ధి సహకారం, భారత జాలర్ల సంక్షేమం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. విద్య, మహిళా సాధికారత, వినూత్న ఆవిష్కరణలు, అభివృద్ధి సహకారం వంటి పలు అంశాలపై శ్రీలంక ప్రధానితో సమగ్రంగా చర్చలు జరిపామని మోడీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మన రెండు దేశాల ప్రజల సంక్షేమానికి చాలా కీలకమైనదని మోడీ పేర్కొన్నారు.
- Advertisement -