నవతెలంగాణ-మెండోర
మెండోర మండలం బుస్సాపూర్ శ్రీ పవన్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి అబాకస్ పోటీలలో జూనియర్ మరియు సీనియర్ లెవెల్స్ లలో రెండు ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారని ఆరవసారి రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ దయానంద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జూనియర్ లెవెల్ వన్ లో రెండవ తరగతి విద్యార్థిని ప్రన్విత మరియు సీనియర్ లెవెల్ వన్ లో మూడవ తరగతి విద్యార్థిని మనశ్విని జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని పాఠశాల నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఇది ఆరవసారని తెలిపారు. అబాకస్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు వారిని రాష్ట్రస్థాయి వరకు వెళ్లే విధంగా కృషిచేసిన అబాకస్ ఉపాధ్యాయిని బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అబాకస్ లో ప్రతిభ చాటిన శ్రీ పవన్ స్కూల్ విద్యార్థినిలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



