Saturday, March 7, 2026
E-PAPER
Homeసినిమాశ్రీరామ నవమి కానుక..

శ్రీరామ నవమి కానుక..

- Advertisement -

‘కోర్ట్‌’ చిత్రంతో మెప్పించిన హర్ష్‌ రోషన్‌, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్‌ మేళం’ అంటూ ఆడియెన్స్‌ ముందుకు రానుంది. రచయిత కోన వెంకట్‌ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్‌ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఈనెల 26న రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్‌ చేసిన కంటెంట్‌ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘బ్యాండ్‌ మేళం’ టీజర్‌, ట్రైలర్‌, మాస్‌ పెప్పీ సాంగ్‌ ‘తిప్పూకుంటున్నావ్‌’, మంచి మెలోడీ సాంగ్‌ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ వంటివి ఆడియెన్స్‌లో సినిమా పట్ల అంచనాల్ని పెంచేసింది.

యూత్‌ ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్‌ చేసుకున్న ఈ చిత్రం శ్రీరాముడి ఆశీస్సులతో శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్‌ కానుంది. ఈనెల 26న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు మేకర్లు ప్లాన్‌ చేశారు. రోషన్‌, శ్రీదేవి, సాయి కుమార్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సమర్పణ : మ్యాంగో మాస్‌ మీడియా, నిర్మాతలు: కావ్య, శ్రావ్య, సహ నిర్మాత: శివరాజు ప్రణవ్‌, రచయిత, దర్శకుడు: సతీష్‌ జవ్వాజి, సంగీతం: విజయ్ బుల్గానిన్‌, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌: శివ ముప్పరాజు, డీఓపీ : సతీష్‌ ముత్యాల, గీత రచయిత: చంద్రబోస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: నార్ని శ్రీనివాస్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -