Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష.!

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష.!

- Advertisement -

ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి
నవతెలంగాణ – మల్హర్  రావు

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్షని మండల ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మండలంలోని వళ్లెంకుంట గ్రామంలో అంగన్ వాడి టీచర్ల ఆధ్వర్యంలో చేపట్టిన తల్లిపాల వారోత్సవాల్లో సూపర్ వైజర్ ముఖ్యదితిగా హాజరై ఈసందర్భంగా తల్లులు, బాలింతలు, గర్భిణులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అంగన్ వాడి టీచర్లు తల్లిపాల వారోత్సవాలను1వ తేదీన గృహ సందర్శన చేసి మూడో త్రైమాసిక గర్భిణులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారన్నారు.

శనివారం గ్రామ, వార్డు స్థాయిలో తల్లిపాల గురించి అవగాహన సదస్సులు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. 4న అన్నప్రాసనపై అవ గాహన సదస్సులు. పూర్తి దృష్టి ద్వారా ఆరు నెలల లోపు బిడ్డలకు సరైన సమయంలో అనుబంధ ఆహారం మొదలుపెట్టడం జరుగుతుందన్నారు. 5,6న 0-24 నెలల పిల్లలు ఉన్న ఇళ్లను సందర్షించి తల్లులకు తల్లి పాలు, బంధం, ఫీడింగ్, ఫ్రీక్వెన్సీపై కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. 7న తల్లిపాల వారోత్సవాల గురించి స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తారు. డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పిల్లల ఆరోగ్యం, తల్లిపాలు, మహిళల సంక్షేమం గురించి వివరిస్తారని, ప్రతి ఒక్కరూ పాల్గొని సహకరించాలని ఆమె కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -