Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కన్నుల పండుగగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

కన్నుల పండుగగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ కళ్యణ దివ్య క్షేత్రము నందు శ్రీ సీతరామ కళ్యాణ మహోత్సవామును వేద మంత్రోచ్ఛారణల మధ్య పండితులు ఘనంగా నిర్వహించారు.ఈ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

బాల్కొండలో
మండల కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.పోచమ్మ గల్లి లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది .అనంతరం పూర్ణాహుతి, హారతి, తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు .ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఆలయాలను దర్శించిన ప్రముఖులు
కిసాన్ నగర్ గ్రామంలో శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని కళ్లారా వీక్షించేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 57 ఏళ్ల ఆధ్యాత్మిక ఈ సందర్భంగా టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ గత 57 ఏళ్లుగా ఈ ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోందని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి శాలువా, మెమొంట్లతో ఘనంగా సన్మానించారు.

ఆలయాల వద్ద పటిష్ట భద్రత
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా మండల పరిధిలోని ఆలయాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు జరగకుండా బాల్కొండ ఎస్ఐ శైలేందర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఏసిపి వెంకటేశ్వర రెడ్డి పలు ఆలయాలను సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -