![]() |
నవతెలంగాణ – కంఠేశ్వర్
మహాకవి శ్రీశ్రీ జయంతి సభ నిర్వహణ కమిటి ఆద్వర్యంలో నేడు నగరంలోని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్ సుభాష్ నగర్ నందు సిర్పలింగం ఆద్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముందుగా శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ శ్రీ గాన విభావరి ద్వారా గాయకులు ఆలపించిన పాటలు అందరిని అలరించాయి. కవి సమ్మేళనంలో కవులు శ్రీ శ్రీ కవితలను వినిపించారు. అనంతరం సిర్పలింగం మాట్లాడుతూ.. శ్రీ శ్రీ కష్టజీవికి ముందు వెనుక ఉన్నవాడే నిజమైన కవి అని అన్నారని గుర్తు చేశారు. చూసిన కట్టడాన్ని కాదు.. దానికి పనిచేసిన కులీలను గౌరవించాలని శ్రీ శ్రీ అందరిలో చైతన్యం నింపాడని గుర్తు చేసాడు. ఈ కార్యక్రమంలో రమణాచారి,తోగర్ల సురేష్, రాధాక్రిష్ణ, సాయికూమార్, ఈ వి ఎల్ నారాయణ, చంద్రశేఖర్,శేఖర్ గౌడ్,రాంమెహన్ రావ్, నర్సింహులు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.