- Advertisement -
హైదరాబాద్ : నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) తెలంగాణ నూతన అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి కొప్పుల నియమితులయ్యారు. హైదరాబాద్లో జరిగిన ఆ సంస్థ 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నరెడ్కొ తెలంగాణ 2026-2028 కాలానికి తన నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా కాళి ప్రసాద్ దామెర, గోపాల కృష్ణ కోరిపల్లి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర రావు రావుల, కోశాధికారిగా సుధాకర్ రెడ్డి కొండల బాధ్యతలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఈ బృందం రాబోయే రెండేండ్ల పాటు తెలంగాణలో నిర్మాణ రంగ సుస్థిర వృద్ధి, వృత్తిపరమైన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయనుందని ఆ సంస్థ పేర్కొంది.
- Advertisement -



